Monday, June 15, 2009

కుకట్ పల్లి ప్రజలతో డా"జె.పి ముఖాముఖి

Wednesday, June 10, 2009

Loksatta Awareness Meeting by Students @ Tulsa, OK

Hi Everybody,

We, Group of committed & dedicated students from university of Tulsa who are inspired by Loksatta are arranging a ''Loksatta Awareness Meeting'' at Tulsa, oklhoma on June 21st (Sunday) at Marting Regional Library. (2.30 pm - 5 pm)"

We are arranging the meeting with Sai Tej From dallas Chapter , Hari Musapeta, president of Oklahoma telugu association & with the support from different chapters of 'People for Loksatta'. (sravanth, raghava & many other supporters)

We Need Your help. Because, we want to do the same at each university with in 4 years. Please let me know, if Anybody who have good contacts with any other university. We need all kind of support from you & we welcome if any Loksatta supporters from Tulsa, OK .


Details of Meeting:-
Martin Regional Library,
2601 S.Garnett Rd.
Tulsa, OK, 74129

2:30 pm - 5 pm on June 21st, Sunday

Mission:

1. To gather & Inspire youth of our country to make them work for the development of the country.
Our Youth doesn't form 100% of the population of the country, but they do form 100% future of the country

2. Conduct Loksatta Awareness Meeting at each & Every college & University in India & in other countries

3. To Make Aware of Every Citizen's Responsibilities towards his/her nation & Make them contribute for the country.

Nation becomes great, only when citizens of their country knows their responsibilities & fullfil them properly.

Contact me if you need any other details,

Prahadhir (412 370 9334)
SecondFreedomMovement@gmail.com

అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం పై డా" జె.పి గారి ప్రసంగం

Sunday, June 7, 2009

ఫ్రవాస భారతీయ 'సత్తా' (పీపుల్ ఫర్ లోక్‌సత్తా)



గతి తప్పిన ప్రజాస్వామ్యాన్ని గాడిలో పెట్టటానికి నడుం కట్టిన డా" జయ ప్రకాశ్ నారాయణ్ ఆశయసాధనలో 'నేను సైతం' అంటూ కదలిన ప్రవాస భారతీయుల కృషి అభినందనీయం. ఫ్రజలే ప్రభువులు, పాలకులంతా సేవకులని విశ్వసించే నిజమైన ప్రజాస్వామ్య స్థాపనకు కట్టుబడ్డ లోక్ సత్తా పార్టికి ప్రవాస భారతీయుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కొత్త తరం కోసం కొత్త రాజకీయాన్ని ఆవిష్కరించే లక్ష్యంతో పుట్టిన లోక్ సత్తా పార్టికి తమ వంతు సాయం అందించటానికి ప్రవాస భారతీయులు సమాయత్తమయ్యారు. భ్రష్టు పట్టిన ప్రభుత్వ విధానాలకి బాధపడి, సర్వం అవినీతిమయమయిన రాజకీయాలని ఏవగించుకొని యేళ్ళ తరబడి దూరంగా ఉండిపోయిన యువత 'ఈ మార్పు మనకోసం' అంటూ ముందడుగు వేస్తోంది. విద్య, విజ్ఞానాలతో అవకాశాలని అందిపుచ్చుకొని జన్మభూమిని విడిచి సుదూరాలకి చేరి ప్రతినిత్యం బిజీబిజీ గా ఉండే ప్రవాస భారతీయులు తమకుతాముగా ఈ మహోద్యంలో పాల్గొంటూ మరెందరినో చైతన్యవంతులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా అవినీతి రహిత వ్యవస్థని చూడాలని ఆశిస్తూ, లోక్‌సత్తా పార్టీ సిద్ధాంతల మీద, నాయకత్వం మీద నమ్మకంతో భాద్యతాయుతంగా పాటు పడే ప్రవాస భారతీయులు అందరూ స్వతంత్రంగా ఒక విభాగాన్ని (పీపుల్ ఫర్ లోక్‌సత్తా, www.peopleforloksatta.org) స్తాపించి, ఆ విభాగం ద్వారా లోక్‌సత్తా ఆశయాలను అందరికి తెలియ చేయడంలో పోషించిన పాత్ర నిజంగా ప్రశంసనీయం.

వృత్తిరీత్యా సుదూరాలలో ఉన్నా, జన్మభూమిని మరచిపోకుండా తామెక్కడ ఉన్నా తమవారందరి జీవన ప్రమాణాలు మెరుగు పడాలని ప్రతినిత్యం తపిస్తూ రోజులో కొన్ని గంటలైనా తెలుగు ప్రజల గూర్చి ఆలోచిస్తూ, తమని తాము చైతన్యపరచుకొంటూ మరో నలుగురునైనా చైతన్యపరచలనే ఉద్యేశ్యంతో సాగిస్తున్న ఈ మహాప్రస్థానంలో తమ వంతు కృషి చేస్తున్నవారెందరో ఉన్నారు. 'నిజాయితీ మాటలలో కాదు చేతలలో చూపించే రాజకీయనాయకుడు మనకు కావాలి' అని ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న ఈ యువత, వచ్చిన ఈ మహావకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, సమాజశ్రేయస్సు కోసం పరితపించే ఈ ప్రయత్నంలో 'అధికారం మార్గమే కానీ లక్ష్యం కాదనే' డా" జెపి గారి మాటలు నిజరూపం దాల్చే రోజుల కోసం ఆశగా ఎదురు చూస్తూ, నూతన రాజకీయంతో నవసమాజాన్ని నిర్మించే వరకు అవిశ్రాంత పోరాటం చేయడమే ఈ ప్రవాస భారతీయుల ముఖ్య ఆశయం.

ఒకరికి ఒకరం, మనకోసం మనమందరం అంటూ ముందుకు సాగుతూ, ఈ విభాగం ద్వారా గత ఎన్నికలలో లోక్‌సత్తా విజయం కొరకు చేపట్టిన కార్యక్రమాలలో కొన్ని:
  1. ప్రచారంలో కొత్తపుంతలు: తమ ప్రాంతం లోని ఇతర ఎన్నారై లకు లోక్‌సత్తా పార్టీ సిద్దాంతలు, వోటు యొక్క ప్రాముఖ్యాన్ని, ఎన్నికలలో ముక్యమైన ఇతర విషయాల మీద అవగాహన కొరకు కర పత్రాలు పంచడం మరియు ఇ-మెయిల్, వెబ్ సైట్ ల ద్వారా తమ భాద్యతల గురించిన ఆలోచనలు రేకిత్తించడం.
  2. ఫోన్ ప్రచారం - 'పీపుల్ ఫర్ లోక్‌సత్తా' ప్రవాస భారతీయ మద్దతుదారులు తమ స్నేహితులకు, బంధువులకే కాక దాదాపుగా 25000 మందికి ఫోన్ ద్వారా ప్రచారం చేసి ప్రచారంలో కొత్త పుంతలకు, సృజనాత్మకతకు తెర తీయడమే కాక, సుమారు 40000 మందికి SMS ల ద్వారా ప్రచారం చేయడం కార్యకర్తల నిబద్దతకు నిదర్శనం.
  3. లాండ్ మార్క్ ప్రచారం - వివిధ దేశాలలోని ప్రసిద్ద ప్రాంతాల(ఈఫిల్ టవర్, స్టాట్యు ఆఫ్ లిబర్టి, గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ ..) నుండి అక్కడి ప్రవాస భారతీయులు తమ బంధువులకు, స్నేహితులకు సోదర ప్రజానికానికి లోక్‌సత్తా పార్టీ గురించిన సందేశం అందించడం.
  4. నిధుల సేకరణ - చినుకు చినుకు కలిసి వచ్చే వాగులా, ప్రవాస భారతీయ లోక్‌సత్తా మద్దతుదారులు 'పీపుల్ ఫర్ లోక్‌సత్తా' విభాగం ద్వారా ప్రవాస భారతీయుల వద్ద సేకరించిన నిధులు ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో లోక్‌సత్తా పార్టీ కార్య కలాపాలకు, ప్రచార నిర్వహణకు ఎంతో దోహద పడింది.
  5. అభ్యర్దుల ఎంపిక: నిస్వార్దపరులు మరియు లోక్‌సత్తా పార్టీ సిద్దాంతాలను, ఉన్నతమైన ఆశయాలను సాధించగల అభ్యర్దులను సూచించడం లోను, ఎంపిక చేయడం లోను పీపుల్ ఫర్ లోక్‌సత్తా మద్దతుదారులు చేసిన కృషి అభినందనీయం.
  6. సాంఘీక, సాంస్కృతిక కార్యక్రమాలు: తమ తమ ప్రదేశాలలో జరిగే సాంఘీక, సాంస్కృతిక కార్యక్రమాలలో స్టాల్స్ ని నిర్వహించి లోక్‌సత్తా సిద్దాంతాల గురించి తెలియ చెప్పడం. తమకి చేతనయినంతలో తమ బంధువులని, స్నేహితులని అవినీతిని ఆశ్రయించకుండా సక్రమమయిన మార్గంలో నడుచుకొనేల ప్రోత్సహించడం.
  7. చర్చా వేదికలు: ప్రవాస భారతీయులు పలు విభాగాలుగా ఏర్పడి, చర్చా వేదిక(గ్రూప్ డిస్కషన్)ల ద్వారా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోని సమస్యలను శాస్త్రీయమైన అధ్యయనంతో ఆచరణ సాధ్యమైన పరిష్కార మార్గాలను అన్వేషించడానికి చర్చా వేదికలను నిర్వహిస్తున్నారు. తమ చుట్టూ ఉన్న వాళ్ళలో ప్రస్తుత రాజకీయాలు, రావలసిన మార్పులు, వాటిని సాధించే క్రమంలో ప్రతి పౌరుడి గురుతర బాధ్యతల మీద ఎప్పడి కప్పుడు చర్చలు జరిపి ఒక స్పష్టమైన అవగాహనని పెంపొందించడం.
  8. ప్రత్యక్ష ప్రచారం: వృత్తిరీత్యా ప్రపంచంలో వివిధ ప్రాంతాలలో పని చేస్తున్న లోక్‌సత్తా మద్దతుదారులు (దాదాపు 30 మంది) తమ తమ ఉద్యోగాలకు సెలవు తీసుకొని, లోక్‌సత్తా విజయం కొరకు ఆంధ్ర ప్రదేశ్ లో ప్రచార కార్యక్రమాలలో పాల్గొనడం, వారు ప్రస్తుత రాజకీయాలలో ఖశ్చితమైన మార్పును ఎంతగా ఆశిస్తున్నారో చెప్పడానికిదే నిదర్శనం.

అధికారమే పరమావధిగా వీలైనన్ని అడ్డ దారులు త్రొక్కైనా విజయం సాధించాలని తపన పడే ప్రస్తుత కుహానా రాజకీయాలకు విభిన్నంగా నమ్మిన సిద్దాంతాల కోసం మొక్కవోని నిజాయితీతో, చెక్కుచెదరని చిత్తసుద్దితో సాధించే చిన్న విజయమయినా గొప్ప విజయం. జరిగిన ఎన్నికలతో, వాటి ఫలితాలతో సంబంధం లేకుండా ఒక వ్యవస్తీకృతమైన ప్రణాళికతో అమెరికాలోనే కాక ప్రపంచం నలుమూలలా నివసిస్తున్న ప్రవాసభారతీయులు నగరాలవారిగా వివిధ గ్రూపులుగా ఏర్పడి (http://www.peopleforloksatta.org/usa.html) తమకార్యకలాపాలని కొనసాగిస్తున్నారు. అందరు నచ్చే, మెచ్చే సమ సమాజాన్ని నిర్మించడానికి, కుల, మత, ప్రాంత, అర్ద వివక్ష లేని నిస్పక్షపాతమైన వాతావరణాన్ని కల్పించడానికి, ప్రతీ రోజు నూతన ఉత్సాహంతో పని చేస్తున్న లోక్‌సత్తా ప్రవాస భారతీయులు తాము కల కన్న సమైక్య సమాజాన్ని త్వరలోనే సాధించడానికి అవిరామంగా కృషి చేస్తున్నారు.

Composed by:,
Satyasuresh Donepudi
Kranthi Gaddam
Aswini Betha
Chakri Karri
Suresh Matta
- People for Loksatta Media Group

Same published on May 19th 2009 at:

http://news.loksatta.org/2009/05/nris-happy-over-lok-satta-performance_19.html


All Posts